'హైదరాబాద్ పర్యాటక మణిహారంగా దుర్గంచెరువు' - GHMC_Commissionar
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జితో హైదరాబాద్ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా దుర్గంచెరువు కూడా చేరనుంది. సాఫ్ హైదరాబాద్... షాన్‌దార్ హైదరాబాద్ పేరిట నగరాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్ తెలిపారు.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు అక్టోబర్ చివరిలోగా పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్ వెల్లడించారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులను మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి ప్రపంచంలోనే మొదటిదని స్పష్టం చేశారు. వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్‌తో పాటు అత్యాధునిక ఆకర్షణీయమైన లైటింగ్ సిస్టం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌కు దుర్గం చెరువు సరికొత్త పర్యటక కేంద్రంగా నిలవనుందన్నారు. మొత్తం నాలుగు దశల్లో నిర్మాణ పనులు పురోగతి సాధించాయని, 2 మిలియన్ సురక్షిత పని గంటలు పూర్తి చేయటం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించామన్నారు. అనంతరం మియాపూర్‌లో సాఫ్ హైదరాబాద్, షాన్‌దార్ హైదరాబాద్ పేరిట ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొని కాలనీవాసులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.