జీహెచ్ఎంసీ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించిన కమిషనర్ దానకిశోర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహానగరపాలక సంస్థలో ఏటా వాహనాల అద్దె పేరిట దాదాపు వందల కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేస్తోంది. ఈ వాహనాలను స్వయం సహాయక బృందాల ద్వారా కొనుగోలు చేయించి వాటిని జీహెచ్ఎంసీకే అద్దెకు ఇవ్వనున్నారు.
ఎస్‌హెచ్‌జీలు, సీఆర్పీల నియామకం, బస్తీ దవాఖానాల ఏర్పాటుకు కీలక నిర్ణయాలు రూ. 25లక్షల వరకు బ్యాంకు రుణంహైదరాబాద్లో ప్రస్తుతం రూ.45వేల స్వయం సహాయక బృందాల్లో నాలుగున్నర లక్షల మంది మహిళా సభ్యులు ఉన్నారు. ఈ బృందాల్లో 10 నుంచి 15 ఏళ్ల సీనియార్టీ కలిగి క్రమం తప్పకుండా రుణాలను చెల్లించే కనీసం 100 బృందాలను గుర్తించారు. ఒక్కో బృందానికి రూ.25లక్షల వరకు బ్యాంకుల నుంచి రుణాలు అందజేసేందుకు నిర్ణయించామని దానకిశోర్ వివరించారు.ఇప్పటికే ఒక్కో బృందానికి రూ. 10-15 లక్షల వరకు బ్యాంకు రుణాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. వీటిని రూ.25లక్షలకు పెంచి అందించనున్నట్లు వివరించారు. ఈ నిధులతో ఆయా బృందాలతో ట్రక్‌లు, మినీ లారీలు కొనుగోలు చేయించి వాటిని జీహెచ్ఎంసీకి అద్దె ప్రాతిపదికపై ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. దీని వల్ల ఎస్‌హెచ్‌జీ మహిళలు ఆర్థికంగా బలోపేతం కానున్నారు. స్వయం సహాయక బృందాలను పటిష్ఠం చేసి వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడానికి కొత్తగా 3వేల మంది సీఆర్పీలను నియమించనున్నట్లు ప్రకటించారు. కొత్తగా నెలకు ఆరువేల రూపాయల పారితోషికంతో వీరిని నియమించనున్నామని తెలిపారు.
మరో రెండొందల బస్తీ దవఖానాలు ఏర్పాటుపేదవారి వైద్యం కోసం ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన 105కు పైగా బస్తీ దవఖానాలు విజయవంతమయ్యాయని తెలిపారు. గ్రేటర్‌లో మరో 200 బస్తీ దవఖానాల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, ప్రాంతాలను మూడు నెలల్లోగా ఎంపిక చేస్తామన్నారు.
మరో 2వేల కొత్త గ్రూపుల ఏర్పాటుప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 2వేల స్వయం సహాయక మహిళా బృందాలను ఏర్పాటు చేయాలని కమిషనర్ దానకిశోర్ ఆదేశించారు. ప్రస్తుతం 45వేల గ్రూపులు ఉన్నప్పటికీ వీటిలో దాదాపు 7వేల గ్రూపులు సక్రమంగా పనిచేయట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటుచేసే 2వేల గ్రూపుల్లో కనీసం 500 గ్రూపులు అత్యంత నిరుపేద మహిళలే సభ్యులుగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.