తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజావాణి రద్దు.. గూగుల్​ మీట్​తో సమస్యల పరిష్కారం - ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసిన జీహెచ్​ఎంసీ

కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని బల్దియా రద్దుచేసింది. గూగుల్​ మీట్​ ద్వారా ప్రజలతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేసింది.

ghmc cancelled prajavani due to corona
ప్రజావాణి రద్దు.. గూగుల్​ మీట్​తో సమస్యల పరిష్కారం

By

Published : Jun 23, 2020, 7:54 AM IST

జీహెచ్​ఎంసీ పరిధిలో కొవిడ్​ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు బల్దియా కమిషనర్ లోకేశ్​కుమార్​ పేర్కొన్నారు. గూగుల్​ మీట్​ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ​

పని దినాల్లో రోజూ సాయంత్రం 4 నుంచి 5 వరకు ఆన్​లైన్​ వీడియో కాన్ఫరెన్సులో ప్రజలతో మాట్లాడనున్నట్లు లోకేశ్​కుమార్​ ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. ఇంటి వద్ద నుంచే సమస్యలను అధికారుల దృష్టికి తేవచ్చని సూచించారు. పౌరులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఇదీచూడండి: 'ప్రత్యేక డ్రైవ్​లో తొలిరోజు 30 భవనాల కూల్చివేత'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details