Buildings wastage plants: హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న భవన నిర్మాణ వ్యర్థాల కట్టడికి జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. అదనంగా మరో రెండు చోట్ల ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించింది. ఏడాదిలోపే అందుబాటులోకి వాటిని తీసుకు రానున్నట్లు తెలిపింది.
ఇందులో భాగంగా ఇప్పటికే జీడిమెట్ల, ఫతుల్లాగూడలో నిర్మాణ వ్యర్ధాలను ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన బల్దియా అవి విజయవంతం కావడంతో మరో రెండుచోట్ల నిర్మించేలా ప్రణాళికలు రచించింది. కొత్తగా సికింద్రాబాద్, చార్మినార్‌లలో ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించింది. ఒక్కో ప్లాంట్‌లో 500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ప్రాసెసింగ్ చేస్తున్నారు.