హైదరాబాద్ చిలకలగూడలోని డంపింగ్ యార్డు నిర్మాణాన్ని నిలిపేయాలని గ్రేటర్ హైదరాబాద్ భాజపా నేతలు డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డును స్థానిక కార్యకర్తలతో పరిశీలించిన భాజపా నేతలు బండపల్లి సతీశ్, సారంగపాని... నిర్మాణం నిలిపేయాలని కోరారు.
'పార్టీలకతీతంగా డంపింగ్‌యార్డు నిర్మాణాన్ని అడ్డుకోవాలి' - చిలకలగూడలో భాజపా నేతల నిరసన
చిలకలగూడ మున్సిపల్ మైదానంలో చెత్త డంపింగ్ యార్డ్ నిర్మాణం పట్ల గ్రేటర్ హైదరాబాద్ భాజపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలతో కలిసి బండపల్లి డంపింగ్‌యార్డును పరిశీలించి... నిర్మాణం ఆపాలని డిమాండ్ చేశారు.
'పార్టీలకతీతంగా డంపింగ్‌యార్డు నిర్మాణాన్ని అడ్డుకోవాలి'
అధికారులు స్పందించి నిర్మాణం ఆపకపోతే... ఆదివారం నుంచి నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. జనావాసాల మధ్య డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి... ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని... డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు విజ్ఞప్తి చేశారు. మైదానానికి ఆనుకొని స్థలంలో ఏర్పాటు చేసిన కల్లు కాంపౌండ్ వలన ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. పార్టీలతీతంగా అందరూ కలసి డంపింగ్ యార్డు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ముందుకు రావాలని తెలిపారు.