జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణ పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. పోలింగ్ కోసం 30వేల బ్యాలెట్ బాక్సులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. వాటిని ఏపీ నుంచి తీసుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటించిన స్థానిక సంస్థల ఎన్నికలకోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి 30వేల బ్యాలెట్ బాక్సులను పంపారు. అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డందున వాటిని తెచ్చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ ఎన్.యాదగిరిరావు తెలిపారు.
శరవేగంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఏర్పాట్లు - జీహెచ్‌ఎంసీ ఎన్నికలు
హైదరాబాద్ మహానగరం సాధారణ ఎన్నికలకు సిద్ధమవుతోంది. పోలింగ్‌ను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోలింగ్ కోసం అవసరమైన బ్యాలెట్ బాక్సులను ఏపీ నుంచి తీసుకొస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా బ్యాలెట్ బాక్సుల నోడల్ అధికారిగా ఎన్.యాదగిరిరావును జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ నియమించారు. గురువారం వరకు 17,366 బ్యాలెట్ బాక్స్‌లు ఏపీలోని 7 జిల్లాల నుంచి అందినట్లు యాదగిరిరావు తెలిపారు. వీటిని విక్టరీ ప్లే గ్రౌండ్‌లో భద్రపరుస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లా నుంచి 7,111, చిత్తూరు నుంచి 5,458, అనంతపురం 357, ప్రకాశం 841, నెల్లూరు 1300, తూర్పుగోదావరి నుంచి 449, బ్యాలెట్ బాక్స్‌లు రాగా... కడప నుంచి 1850 బాక్స్‌లు తీసుకొచ్చినట్లు యాదగిరిరావు వివరించారు.
ఇదీ చూడండి:వనపర్తి పురపాలిక కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి సస్పెన్షన్