భాగ్యనగరంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ సూచించారు. ప్రజలెవరూ అనవసరంగా బయటకు రావొద్దని సూచించారు. నగరంలోని పురాతన ఇళ్లల్లో ఉన్న వారిని ఖాళీ చేయించి... కమ్యూనిటీ హాల్స్‌లో వసతులు ఏర్పాటు చేస్తున్నామని కమిషనర్ వెల్లడించారు.
'హెచ్చరిక... అత్యవసరమైతే తప్ప అడుగు బయటపెట్టొద్దు' - తెలంగామ తాజా వార్తలు
హైదరాబాద్ మహానగరంలో మరో రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ అన్నారు. పరిస్థితుల దృష్ట్యా నగరవాసులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు.
'భాగ్యనగర వాసులకు హెచ్చరిక: అత్యవసరమైతే తప్ప అడుగు బయటపెట్టొద్దు'
రోడ్లపైకి వస్తున్న నీటిని వెంటనే తొలగిస్తున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీకి వస్తున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కారిస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు.