తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వేళ.. నగరంలో జీహెచ్​ఎంసీ యాక్షన్​ ప్లాన్​ - కరోనా లక్షణాలు

కరోనాను కట్టడి చేసేందుకు జీహెచ్​ఎంసీ యాక్షన్​ ప్లాన్​ సిద్ధం చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా నగరంలోని ప్రధాన ఏరియాల్లో శానిటైజ్​ చేస్తున్నారు. ట్యాంక్​ బండ్​, జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో స్ప్రే చల్లిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు.​

ghmc-action-plan-to-prevent-coronavirus-in-hyderabad
కరోనా వేళ.. నగరంలో జీహెచ్​ఎంసీ యాక్షన్​ ప్లాన్​

By

Published : Mar 21, 2020, 12:31 PM IST

Updated : Mar 21, 2020, 12:58 PM IST

కరోనా వేళ.. నగరంలో జీహెచ్​ఎంసీ యాక్షన్​ ప్లాన్​

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ చర్యలు చేపట్టింది. జీహెచ్​ఎంసీ ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బంది.. ప్రధాన కూడళ్లు, జనం తిరిగే ప్రదేశాల్లో స్ప్రేతో శానిటైజ్​ చేస్తున్నారు. స్వీయ క్వారంటైన్​ జరిగిన ఇళ్లు, చుట్టుపక్కల ప్రాంతాలు, కరోనా పాజిటివ్​ కేసులు గుర్తించిన ప్రాంతాలు, పరిసరాలలో కరోనా వైరస్​ను నశింపజేసేందుకు చర్యలు చేపట్టారు. జీహెచ్​ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న 125 స్ప్రేయింగ్​ యూనిట్లతో 150 వార్డుల్లో అవసరమైన చోట స్పెషల్​ శానిటైజ్​ స్ప్రేయింగ్​లో పాల్గొంటున్నారు.

ఇంటింటా ఆరా...

ప్రతి యూనిట్​లో 18మంది సిబ్బందితో పాటు ఈవీడీఎంలో శిక్షణ పొందిన 300 మంది సిబ్బంది పలు చోట్ల స్ప్రే చల్లుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన భారతీయులు, విదేశీయుల వివరాలను జీహెచ్​ఎంసీ సేకరిస్తోంది. వారు స్వీయ క్వారంటైన్​ అయ్యారా.. లేదా ఆరోగ్యస్థితి కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.

Last Updated : Mar 21, 2020, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details