అక్రమ కట్టడాలపై జీహెచ్‌ఎంసీ కొరడా - జీహెచ్‌ఎంసీ కొరడా
హైదరాబాద్లోని అక్రమ కట్టడాలపై జీహెచ్‌ఎంసీ కొరడా ఝులిపించింది. రహదారుల పక్కన అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించారు.
నగరంలో అక్రమ కట్టడాలపై జీహెచ్‌ఎంసీ కొరడా
రహదారులపై అక్రమంగా నిర్మించిన కట్టడాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు కొరడా ఝులిపించారు. ఎల్బీనగర్, సరూర్‌నగర్ ప్రాంతాల్లో వాహనదారులు, పాదచారులకు ఇబ్బంది కలిగిస్తున్న దుకాణ సముదాయాలను తొలగించారు. మళ్లీ రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈక్రమంలో తోపుడు బండ్ల నిర్వాహకులు తమకు ప్రత్యామ్నాయం చూపించాలని ఆందోళనకు దిగారు.