తెలంగాణ

telangana

ETV Bharat / state

అమరవీరుల స్థూపాన్ని ప్రారంభించిన గద్దర్​ - హైదరాబాద్​లో అమరవీరుల స్థూపాన్ని ప్రారంభించిన గద్దర్​

భీమా కోరెగాం​ ఘటన జరిగి 203 ఏళ్లు గడిచినా సమాజంలో ఇప్పటికీ కుల వివక్ష ఉండటం బాధాకరమని ప్రజా గాయకుడు గద్దర్​ అన్నారు. బానిసత్వంపై పోరాడి ఆత్మగౌరవ విజయాన్ని సాధించిన ఆ ఘటనను పుస్తక రూపంలో ప్రచారం చేయాలని యువతను కోరారు. భీమా కోరెగాం శౌర్య దివస్​ను పురస్కరించుకుని హైదరాబాద్​లో అమరవీరుల స్థూపాన్ని ఆయన ప్రారంభించారు.

ghadar-inaugurated-the-martyrs-monument-in-the-hyderabad
నగరంలో అమరవీరుల స్థూపాన్ని ప్రారంభించిన గద్దర్​

By

Published : Jan 1, 2021, 5:03 PM IST

సమాజ నిర్మాణం కోసం అసువులు బాసిన వీరులను స్మరించుకోవాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. భీమా కోరెగాం శౌర్య దివస్​ను పురస్కరించుకుని 'భీమా కె హీరోస్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ' ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్ అంబేద్కర్ విగ్రహం పక్కన అమరవీరుల స్థూపాన్ని ఆయన ప్రారంభించారు.

భీమా కోరేగాం ఘటన జరిగి 203 సంవత్సరాలు గడుస్తున్నా.. నేటి సమాజంలో నాటి కుల వివక్ష బీజాలు ఇంకా ఉండటం బాధాకరమని గద్దర్​ అన్నారు. బానిసత్వంపై పోరాడి ఆత్మగౌరవ విజయాన్ని సాధించిన ఘటనను పుస్తక రూపంలో ప్రచారం చేయాలని ఆయన కోరారు. ఇందుకోసం యువత ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.

ఇదీ చదవండి :రెవెన్యూ అధికారుల తీరుతో రైతు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details