తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమ వెంచర్​ను కూల్చివేసిన జీహెచ్​ఎంసీ అధికారులు - latest news on GH MC officials sacked the illegal venture

హుస్సేన్​ సాగర్​ పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్​ను జీహెచ్​ఎంసీ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జీహెచ్​ఎంసీ సికింద్రాబాద్​ జోనల్​ కమిషనర్​ శ్రీనివాస్​రెడ్డి హెచ్చరించారు.

GH MC officials sacked the illegal venture
అక్రమ వెంచర్​ను కూల్చివేసిన జీహెచ్​ఎంసీ అధికారులు

By

Published : Feb 1, 2020, 4:56 PM IST

గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై బల్దియా యంత్రాంగం సీరియస్​గా స్పందించింది. హుస్సేన్​సాగ‌ర్ ప‌రిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచ‌ర్‌ను సికింద్రాబాద్ జోన‌ల్ అధికారులు కూల్చివేశారు. 6 జేసీబీలు, 30 మంది సిబ్బందితో నిర్మాణాల‌ను.. వెంచర్​ను కూల్చివేసిన‌ట్లు జోన‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస్​రెడ్డి తెలిపారు.

అక్రమ వెంచర్​ను కూల్చివేసిన జీహెచ్​ఎంసీ అధికారులు

ప్రభుత్వ భూముల‌ు, చెరువులు, స‌ర‌స్సుల‌ను కాపాడేందుకు ప‌టిష్టమైన చ‌ర్యలు తీసుకుంటున్నట్లు శ్రీనివాస్​ రెడ్డి వెల్లడించారు. అక్రమ లేఅవుట్‌లు, నిర్మాణాల‌ను ఉపేక్షించేది లేద‌ని స్పష్టం చేశారు. అక్రమ వెంచ‌ర్లు, నిర్మాణాలను తొల‌గించ‌డమే కాకుండా అట్టి చర్యలకు పాల్పడిన వ్యక్తుల‌పై చ‌ట్టప‌ర‌మైన చ‌ర్యలు తీసుకుంటామ‌ని హెచ్చరించారు.

ఇవీచూడండి:బడ్జెట్​ 2020​ : నిర్మలమ్మ బడ్జెట్​ విశేషాలివే

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details