German Passport Issue Of Former BRS MLA Chennamaneni Ramesh In High Court : బీఆర్ఎస్ పార్టీకి చెందిన వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు జర్మన్ పాస్‌పోర్టు ఉందని కేంద్ర హోం శాఖ హైకోర్టుకు నివేదించింది. పాస్ పోర్టును 2033 వరకు పునరుద్దరించుకున్నారని గత ఏడాది ఈ పాస్‌పోర్టుతో జర్మన్ మూడు సార్లు వెళ్లి వచ్చారని తెలిపింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా తన పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ చెన్నమనేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. చెన్నమనేని ప్రయాణ వివరాలు అందించాలన్న ఆదేశాల మేరకు కేంద్రం రికార్డును అందజేసింది. మరోవైపు చెన్నమనేని జర్మన్ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు మెమో దాఖలు చేశారు.
పౌరసత్వ రద్దుపై హైకోర్టుకు చెన్నమనేని రమేశ్
BRS MLA Chennamaneni Ramesh :జర్మన్ పాస్‌పోర్టు మీద ప్రయాణించినంత మాత్రాన పౌరసత్వం ఉన్నట్టు కాదని జర్మన్ ఎంబసి చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. పౌరసత్వ చట్టం ప్రకారం విచారించి నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలకు విరుద్దంగా కేంద్రం వ్యవహరించిదన్నారు. అప్పట్లో ఫిర్యాదు చేసిన ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తు ఆ దేశ పౌరుడు కాకుండా పాస్‌పోర్టు పొందలేరన్నారు. ఇప్పటికీ రెండు దేశాల పాస్ పోర్టులు ఉన్నాయని కోర్టును తప్పుదోవ పట్టిస్తూ వస్తున్నారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది.
జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్న ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్: కేంద్రానికి హైకోర్టు గడువు