తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇతర రాష్ట్రాల్లో కోతలు ఉన్నా.. తెలంగాణలో 24 గంటల విద్యుత్​' - హైదరాబాద్ తాజా వార్తలు

పక్క రాష్ట్రాల్లో కరెంట్​​ కోతలు ఉన్నా.. తెలంగాణలో మాత్రం 24 గంటలు విద్యుత్​​ ఇవ్వగలుగుతున్నామని జెన్​ కో, ట్రాన్స్​ కో సీఎండీ ప్రభాకర్​ రావు పేర్కొన్నారు. హైదరాబాద్​ మింట్​ కాంపౌండ్​లో ఆచార్య జయశంకర్​ పేరు మీదుగా చేపట్టిన భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.

genco transco cmd prabhakar rao
సీఎండీ ప్రభాకర్ ​రావు

By

Published : Sep 3, 2021, 2:28 PM IST

దేశ వ్యాప్తంగా గత వారంలో విద్యుత్ కోతలు విధించినప్పటికీ.. రాష్ట్రంలో 24 గంటల నిరంతరాయ సరఫరా ఇస్తున్నామని జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు పేర్కొన్నారు. విద్యుత్​ సరఫరాలో అంతరాయం లేకుండా ఉద్యోగులు శ్రమిస్తున్నారని కొనియాడారు. ఆచార్య జయశంకర్ పేరు మీదుగా హైదరాబాద్ మింట్ కాంపౌండ్​లో నిర్మించతలపెట్టిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ భవన్​కు ఆయన శంకుస్థాపన చేశారు.

వివిధ కారణాలతో పక్క రాష్ట్రాల్లోనూ విద్యుత్ కోతలు విధించారని పేర్కొన్న ఆయన.. నిరంతరాయ సరఫరా కోసం కృషి చేస్తున్న ఇంజినీర్లు, సిబ్బందిని అభినందించారు. రానున్న రోజుల్లో డిమాండ్ ఇంకా పెరుగుతుందని... కోటి ఎకరాల వరి సాగు దృష్ట్యా సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని ఉద్యోగులను కోరారు.

ఇదీ చదవండి:Hyd Rains: భాగ్యనగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం.. పొంగి పొర్లుతున్న మురుగునీటి కాల్వలు

ABOUT THE AUTHOR

...view details