ఆదాయం 5; వ్యయం 5;
రాజపూజ్యం 3; అవమానం 6
ఆదాయం 5; వ్యయం 5;
రాజపూజ్యం 3; అవమానం 6
ఈ రాశి వారికి అర్థ లాభం, యశోవృద్ధి లభిస్తాయి. ముఖ్యమైన కార్యాల్లో విజయం లభిస్తుంది. భూ, గృహ, వాహన లాభాలు ఉన్నాయి. విద్యార్థులకు చక్కని విద్యాయోగం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరమైన ఫలితాలు లభిస్తాయి. కాలం అన్నివిధాలా సహకరిస్తుంది. కొందరి వల్ల నిరాశ ఎదురవుతుంది. ఆశయం త్వరగా నెరవేరడం ఉత్సాహాన్నిస్తుంది. పట్టువిడుపులతో ముందుకుసాగండి.
కుటుంబసభ్యుల సలహాలు అవసరమవుతాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. వివాదాల జోలికి పోవద్దు. శాంతచిత్తంతో సంభాషించండి. గృహ నిర్మాణపనుల్లో పురోగతి ఉంటుంది. ఆదాయమార్గాలు పెరుగుతాయి. శని, రాహు శ్లోకాలు చదువుకోవాలి. శివారాధన మంచిది.
ఇదీ చూడండి:ప్లవ నామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకున్నారా?