ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలు అవలంభిస్తోందని విమర్శించారు. గ్లోబరీనా సంస్థకు సామర్థ్యం లేదని గతంలోనే కడియం శ్రీహరి కమిటీ తేల్చిందని గుర్తు చేశారు. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చనిపోయిన పిల్లల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
'విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి' - గీతారెడ్డి
ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు నెట్టివేయడం దారుణమన్నారు.
గీతారెడ్డి