తెలంగాణ

telangana

ETV Bharat / state

RCET-2021: జూన్ 15న గీతం వర్సిటీ పీహెచ్​డీ ప్రవేశ పరీక్ష - యూజీసీ నియమ నిబంధనలు

హైదరాబాద్​ గీతం వర్సిటీలో పీహెచ్​డీ ప్రవేశాల కోసం నిర్వహించే 'ఆర్​ సెట్' (RCET-2021)​ జూన్ 15న జరగనుంది. ఇంజినీరింగ్, సైన్స్, మేనేజ్ మెంట్ విభాగాలకు అధికంగా దరఖాస్తులు అందినట్లు పరిశోధన, కన్సల్టెన్సీ సేవల విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ రాజా ఫణి పప్పు వెల్లడించారు. పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ జరిపిన మరుసటి రోజే ఫలితాలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

geetham rcet date
geetham rcet date

By

Published : Jun 15, 2021, 4:07 PM IST

హైదరాబాద్​ గీతం వర్సిటీలో పీహెచ్​డీ ప్రవేశాల కోసం నిర్వహించే 'ఆర్​ సెట్'​ను (RCET-2021)​ జూన్ 15వ తేదీన నిర్వహించనున్నారు. మొత్తం 40 విభాగాల్లో 2020-21 విద్యా సంవత్సరానికి దాదాపు 2 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు పరిశోధన, కన్సల్టెన్సీ సేవల విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ రాజా ఫణి పప్పు తెలిపారు. అధికంగా ఇంజినీరింగ్, సైన్స్, మేనేజ్ మెంట్ విభాగాలకు దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నియమ నిబంధనలకు అనుగుణంగా 2 గంటల కాల వ్యవధిలో పరీక్షను నిర్వహిస్తున్నామని రాజా ఫణి తెలిపారు. ఆన్ లైన్ విధానంలో 140 మార్కులకు గాను నిర్వహిస్తున్న పరీక్షలో 50 శాతం మార్కులు సాధించిన వారిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తామని తెలియజేశారు. ఫలితాలను ఒక్క రోజులోనే వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:Weather: రాగల మూడ్రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

ABOUT THE AUTHOR

...view details