ఇంటర్ ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై ఇంటర్ బోర్డు ముట్టడికి యత్నించిన పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కొంత మందిని ఇళ్ల వద్దనే గృహ నిర్బంధంలో ఉంచగా మరికొంతమందిని ముందస్తుగా అరెస్టు చేశారు. గాంధీభవన్ నుంచి ఇంటర్ బోర్డు వరకు బయలుదేరిన మాజీ మంత్రి గీతారెడ్డి ఇతర నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఆధ్వర్యంలో సుమారు 20మంది ఇంటర్ బోర్డు వరకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని ఆరెస్టు చేశారు. పీసీసీ అధికార ప్రతినిధులు మానవతారాయ్, సునీతా రావ్, ఇందిరా, శోభన్, గీతారెడ్డిలను పోలీసులు అడ్డుకోవడం వల్ల ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ క్రమంలో గీతారెడ్డి ఇతర నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి సైఫాబాద్ ఠాణాకు తరలించారు. గాంధీభవన్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మొహరించి వచ్చిన వారిని అరెస్టు చేస్తున్నారు.
మాజీ మంత్రి గీతారెడ్డి అరెస్ట్, సైఫాబాద్ పీఎస్‌కు తరలింపు
ఇంటర్‌బోర్డు ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను, విద్యార్థి సంఘాలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి గీతారెడ్డిని, ఇతర నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మాజీ మంత్రి గీతారెడ్డి అరెస్ట్