వరద ముంపు నుంచి తిరుపతి ఇంకా తేరుకోలేదు. తినడానికి తిండి కూడా సరిగా దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి వరద బాధితుల సహాయార్థం చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్రూ.10లక్షలు విరాళం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10 లక్షలు అందించింది.
GEETHA ARTS donation: తిరుపతిలో వరద బాధితులకు.. 'గీతా ఆర్ట్స్' విరాళం - ap news
తిరుపతి వరద బాధితుల సహాయార్థం సినీ నిర్మాణ సంస్థ 'గీతా ఆర్ట్స్'.. రూ.10లక్షల విరాళం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ సీఎం సహాయనిధికి ఆ మొత్తాన్ని అందించింది.
GEETHA ARTS donation
కాగా.. తిరుపతిలో చాలా కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరదపోటుకు చెరువులు తెగి నివాస ప్రాంతాలలోకి వరద పోటెత్తుతూనే ఉంది. ప్రధానంగా పద్మావతి మహిళ యూనివర్శిటీ, లింగేశ్వర నగర్, కేశవాయినగుంట, ఆటోనగర్, యశోదనగర్, సరస్వతీనగర్, ఉల్లిపట్టెడ, శ్రీకృష్ణనగర్ ముంపులోనే ఉన్నాయి. గాయిత్రినగర్లోని 2 వేల కుటుంబాలు ఇళ్ల నుంచి బయటకురాలేని పరిస్థితి నెలకొంది.
ఇదీ చూడండి:child death with vaccine: ఒకేసారి ఐదు టీకాలు.. మూణ్నెళ్ల చిన్నారి మృతి