తెలంగాణ

telangana

ETV Bharat / state

విశాఖలో మరోసారి పొగలు.. హడలిపోతున్న ప్రజలు - విశాఖ ఎల్జీ పాలిమర్స్ వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని ఎల్​జీ పాలిమర్స్ సంస్థలో గ్యాస్​ అదుపు కాలేదు. గురువారం ఎంతోమందిని ఆసుపత్రుల్లో పడేసిన విషవాయువు.. మరోసారి పొగలు కక్కుతోంది. ఈ క్రమంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఊర్లను ఖాళీ చేస్తున్నారు.

gas-fumes-leaking-again-from-the-tanker-where-there-was-styrene-leakage-on-thursday
ఎల్‌.జి.పాలిమర్స్​ నుంచి మరోసారి పొగలు... భయాందోళనలో ప్రజలు

By

Published : May 8, 2020, 6:32 AM IST

ఏపీలోని విశాఖ ఆర్​.ఆర్​.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్​లో విష వాయువు అదుపు కానట్లు తెలుస్తోంది.‌ పరిశ్రమ నుంచి మరోసారి భారీగా పొగలు వెలువడుతున్నాయి. ఆ పరిశ్రమ చుట్టు పక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలో స్థానికులు భయాందోళనతో నివాసాలు ఖాళీ చేస్తున్నారు. పోలీసులు సైతం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వారికి సూచిస్తున్నారు. ఆర్‌.ఆర్‌.వెంకటాపురం పరిసర గ్రామాలైన సింహాచలం, గోపాలపట్నం, పినగాడి ప్రాంతాల నుంచి జనం తరలిపోతున్నారు. గ్యాస్ లీకేజీ అదుపుపై అధికారికంగా స్పష్టత లేనందున ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముందు జాగ్రత్తగా ఆర్​.ఆర్​. వెంకటాపురంలో అగ్నిమాపక యంత్రాలతో పాటు అంబులెన్స్​లను ఏర్పాటు చేసినట్లు విశాఖపట్నం జిల్లా అగ్నిమాపక అధికారి సందీప్ ఆనంద్ వెల్లడించారు.

ఇదీచూడండి: మాస్క్ లేకపోతే రూ. 1000 జరిమానా... ఉత్తర్వులు జారీ

ABOUT THE AUTHOR

...view details