సికింద్రాబాద్ వారసిగూడలో తెల్లవారుజామున ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. సిలిండర్ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. గౌస్, షబానా దంపతులు తమ నలుగురు కూతుర్లతో సహా ఇంట్లో నిద్రపోతున్న సమయంలో ఈ పేలుడు సంభవించడం వల్ల వారికి గాయాలయ్యాయి.
గ్యాస్ సిలిండర్ పేలి.. ఆరుగురికి గాయాలు - గ్యాస్ సిలిండర్ పేలుడు
సికింద్రాబాద్ వారసిగూడలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో నలుగురు కుమార్తెలతో సహా దంపతులకు గాయాలయ్యాయి. వారిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించాచరు.
గ్యాస్ సిలిండర్ పేలి.. ఆరుగురికి గాయాలు
స్థానికులు హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించి.. క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో గ్యాస్ సిలిండర్ పేలడానికి గల ఆధారాలను సేకరిస్తున్నారు.