వంట గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్నారా? ఎక్కడి నుంచైనా కనెక్షన్ బదిలీ చేసుకుంటున్నారా? అయితే, అదనపు భారం తప్పదు. గ్యాస్ కనెక్షన్ తీసుకునే సమయంలో చెల్లించాల్సిన రిఫండబుల్ డిపాజిట్ మొత్తాన్ని చమురు సంస్థలు పెంచాయి. ఇక నుంచి ఒక్కో సిలిండర్‌కు రూ.2,200 చెల్లించాలి. ప్రస్తుతం ఆ మొత్తం రూ.1,450 ఉంది. ఇతర ప్రాంతాలకు బదిలీ చేసుకునే కనెక్షన్లకు కూడా పెరిగిన డిపాజిట్ మొత్తాన్నే చెల్లించాల్సి ఉంటుంది.
వంట గ్యాస్ వినియోగదారులపై బాదుడు.. నేటి నుంచే.. - gas price increased
వంట గ్యాస్ వినియోగదారులపై భారం పడనుంది. గ్యాస్ కనెక్షన్ తీసుకునే సమయంలో చెల్లించాల్సిన రిఫండబుల్ డిపాజిట్ మొత్తాన్ని చమురు సంస్థలు పెంచాయి. గురువారం నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని ప్రకటించాయి.
ఒక పక్క వంట గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతోంది. ఇప్పుడు డిపాజిట్ మొత్తాన్ని పెంచడంతో ప్రజలపై మరో భారం మోపినట్లయింది. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన కింద దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు ఇచ్చే సిలిండర్‌పై ప్రస్తుతం రూ.1,450 డిపాజిట్‌గా చమురు సంస్థలు వసూలు చేస్తున్నాయి. ఆ మొత్తంలో ఎలాంటి మార్పూ చేయలేదు. ఇకపై రెగ్యులేటర్ మార్చుకోవాల్సి వస్తే ప్రస్తుతం ఉన్న రూ.300 లకు బదులుగా రూ.400 చెల్లించాలి. గురువారం నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని కూడా చమురు సంస్థలు ప్రకటించాయి.
ఇదీ చదవండి :'కారులో వీడియో ఎందుకు తీశారు.. అవి వైరల్ ఎలా అయ్యాయి?'