పాడుదామా స్వేచ్ఛాగీతంఎగరేయుదమా జాతిపతాకం దిగంతాలనినదించి విశ్వవిఖ్యాతినొందగా జాతి గౌరవంజులియన్ వాలా బాగ్ దురంతపునెత్తుటి ధారల నొత్తుకొనిఉరికొయ్యల చెరసాలల గోడలదారుణాలు తలకెత్తుకొని పొగిలిన కాలం.... పోరాడిన కాలంమరిమరి ఒకపరి తలచుకునిమృతవీరుల నెదనిడి కొలుచుకొనీవందే మాతరం నినదించినవీరుల శౌర్యము నలదుకొనిస్వాతంత్య్రం నా జన్మహక్కనిగర్జించిన గళమందుకొనికలకాలం కాపాడుకొనికడు గర్వంగా కొనియాడుకొని..
అంటూ జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని.. వందే మాతర గీతం ఔన్నత్యాన్ని.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటతత్వాన్ని.. భారతీయుల్లో జాగృతిని నింపిన జాతీయ గీతం జన గణ మన గొప్పతనాన్ని.. నేటీ తరానికి సంక్షిప్తంగా ఈ గీతం వర్ణించి చెబుతోంది. 1990లో గంటేడ గౌరినాయుడు కలం నుంచి జాలు వారిన ఈ గీతం.. నేటికీ ఎంతో ప్రాచుర్యంలో ఉంది. పలు ప్రదర్శనల్లో ఈ పాట నృత్య రూపంలో ప్రదర్శించబడుతోంది.
ఈ గీతాన్ని మహారాష్ట్ర విద్యాశాఖ నూతనంగా రూపొందించిన తొమ్మిదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో మొదటి పాఠంగా చేర్చింది. రాష్ట్రేతర తెలుగు పాఠ్యాంశాల్లో చోటు దక్కించుకున్న ఈ పాట రచయిత గంటేడ గౌరినాయుడికి అరుదైన గౌరవం దక్కింది. గౌరినాయుడు స్వస్థలం ఏపీలోని విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట. ఇతను గిరిజన సంక్షేమ శాఖలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రత్యేకంగా దేశభక్తి ప్రబోధించే గీతాలను రాయడం గౌరినాయుడి ప్రత్యేకత. ఎన్నో కథలు, కవితలు, గజల్స్ రచించారు. అంతేకాదు.. గౌరినాయుడు మంచి చిత్రకారుడు, గేయకారుడు. ఇటీవల నైల్ ఆర్ట్ లోనూ మంచి ప్రావీణ్యం సాధించారు. ఉద్యోగ విరమణ తర్వాత.. పార్వతీపురంలో "స్నేహ కళా సాహితీ" అనే సంస్థను స్థాపించారు. దీని ద్వారా తెలుగు సాహిత్యం, రచనకు సంబంధించి ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్నారు. తన రచనల ద్వారా జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.