తెలంగాణ

telangana

ETV Bharat / state

'విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి' - విశాఖ స్టీల్ ప్లాంట్​పై గంటా శ్రీనివాసరావు కామెంట్స్

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అందరూ వ్యతిరేకించాలని రాజీనామా చేసిన తెదేపా ఏపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. పార్టీలకు అతీతంగా విశాఖ నేతలంతా రాజీనామా చేయాలని కోరారు.

'విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి'
'విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి'

By

Published : Feb 6, 2021, 8:46 PM IST

ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు రాజకీయేతర ఐకాస ఏర్పడాలని గంటా శ్రీనివాసరావు కోరారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తన రాజీనామా నిర్ణయాన్ని అన్ని వర్గాలు ప్రశంసించాయన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం అనేకమంది ప్రాణత్యాగం చేశారని గంటా గుర్తు చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్య వస్తే ప్రధానిని కలిశామన్నారు.

మా విజ్ఞప్తి ఆలకించి గతంలో ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. కేవలం నష్టాలను చూపించి ప్రైవేటీకరణ చేయడం తగదు. నష్టాలకు ముఖ్యకారణం.. సొంత గనులు లేకపోవడమే. పరిశ్రమకు సొంత గనులు కేటాయించి లాభాలబాట పట్టించాలి. ఉక్కు పరిశ్రమ వ్యవహారాన్ని ప్రజాఉద్యమంగా మారుస్తాం. అందరూ కలిసి పోరాటం చేస్తే కేంద్రం వెనక్కి తగ్గుతుంది. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రజా ఉద్యమంగా మారుస్తాం.

-గంటా శ్రీనివాసరావు, తెదేపా నేత

ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details