ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచుతూ... అక్రమ విక్రయాలు జరుపుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో నిసిత్ షిండే తన ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. అక్రమంగా గంజాయి విక్రయాలు జరుతున్నాడు.
ఇంట్లోనే గంజాయి పెంపకం... అక్రమంగా వ్యాపారం... - CRIME NEWS IN HYDERABAD
అక్కడా... ఇక్కడా... అయితే దొరికిపోతాననుకున్నాడేమో... సౌకర్యంగా, భద్రంగా ఉన్న స్థలమైతే బెట్టర్ అనుకున్నాడో మరి! ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశాడు ఓ అతితెలివైన వ్యక్తి. తానుంటున్న ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతూ... వ్యాపారం సాగించి... చివరికి దొరికిపోయాడు.
GANJAI SMUGGLING IN HIS HOUSE AT HYDERABAD
సమాచారం అందుకున్న పోలీసులు నిసిత్ ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు. రెండు గంజాయి మొక్కలను, 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిసిత్తో పాటు గంజాయి కొనుగోలు చేస్తున్న ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి:రివ్యూ 2019: గత ఐదేళ్లలో ఈసారే తక్కువ ఐపీఓలు