ఆంధ్ర,ఒడిశా సరిహద్దు నుంచి తరలిస్తున్న గంజాయిని పటాన్చెరు శివారు బాహ్య వలయ రహదారి కూడలిలో ఆబ్కారీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత రాత్రి పట్టుకున్నారు.
జహీరాబాద్‌కు చెందిన వీరుశెట్టి, కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు చెందిన పుత్రాజ్ నీలారామ్ మెట్రాజ్ అనే ఇద్దరు వ్యక్తులు గంజాయిని తరలిస్తున్నారు. వారు రెండు వాహనాల్లో మహారాష్ట్ర, కర్ణాటకకు తరలించేందుకు తీసుకొస్తుండగా... సమాచారం తెలుసుకున్న అబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పటాన్చెరు శివారు ముత్తంగి టోల్‌గేటు సమీపంలో శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 508కిలోల గంజాయిని, తరలిస్తున్న రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.