తెలంగాణ

telangana

ETV Bharat / state

Ganja supply gang arrest in Hyderabad : ఒడిశా నుంచి హైదరాబాద్​కు గంజాయి సరఫరా.. ముఠా అరెస్టు - Rachakonda cp DS Chauhan

Ganja supply gang arrest in hyderabad : రాష్ట్రంలో గంజాయి సరఫరాను పోలీసులు కట్టడి చేస్తున్న నేపథ్యంలో దుండగులు కొత్త పద్ధతులకు తెరతీస్తున్నారు. ఎక్కువ ధర పలికి.. సులభంగా తరలించే అవకాశం ఉన్న హాష్‌ ఆయిల్‌తో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇటీవల వేరు వేరు కేసుల్లో ఉన్నత చదువు పూర్తి చేసిన ఓ వ్యక్తితో పాటు, బీటెక్‌, డిగ్రీ చదువుతున్న వారు సైతం హాష్‌ ఆయిల్‌ విక్రయిస్తూ అరెస్టవుతుండటంతో రాచకొండ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

Hashoil supply gang arrest
Ganja supply gang arrest in hyderabad

By

Published : Aug 5, 2023, 1:14 PM IST

Ganja supply gang arrest in Hyderabad : ఒడిశా నుంచి హైదరాబాద్​కు గంజాయి సరఫరా.. ముఠా అరెస్టు

Ganja supply gang arrest in hyderabad : ఉన్నత చదువు పూర్తి చేసిన ఓ యువకుడు ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్​కు చేరుకున్నాడు. కరోనా ప్రభావం వల్ల ఉద్యోగం పోవడంతో పాల వ్యాపారం నిర్వహించాడు. అందులోనూ నష్టాలు రావడంతో సులభ సంపాదన కోసం అడ్డదారులు ఎంచుకున్నాడు. జైలుకు వెళ్లొచ్చినా.. అతనిలో ఏమాత్రం మార్పు రాలేదు. నిషేధిత హాష్ ఆయిల్ విక్రయిస్తూ రాచకొండ ఎస్ఓటీ పోలీసులకు దొరికిపోయి మరోసారి కటకటాల పాలయ్యాడు.

Hyderabad Ganja Gang Arrest :మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన అజ్మీరా సూర్య వ్యాపారంలో నష్టం రావటంతో నకిలీ మద్యం, సారా అమ్మేవాడు. స్థానిక ఆబ్కారీ పోలీసులు 2022లో సూర్యపై పీడీ చట్టం నమోదు చేసి వరంగల్‌ కారాగారానికి పంపారు. బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత జైలులో పరిచయమైన మరో వ్యక్తితో కలిసి ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి గంజాయి, హాష్‌ ఆయిల్‌ తక్కువ ధరకు తెచ్చి ఇక్కడ విక్రయించడం మొదలు పెట్టాడు.

Ganja gang arrested in Cyberabad : సైబరాబాద్​లో భారీగా గంజాయి పట్టివేత.. విలువ ఎంతంటే?

5 మిల్లీలీటర్ల హాష్‌ ఆయిల్‌ను 7 వేల రూపాయలకు.. హైదరాబాద్‌, జహీరాబాద్‌లో అమ్మేవాడు. ఇదే క్రమంలో వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ తరలిస్తుండగా భువనగిరి ఎస్​వోటీ పోలీసులు సూర్యను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 40 లక్షల రూపాయల విలువైన 3 లీటర్ల హాష్‌ ఆయిల్‌, బైక్‌, రెండు చరవాణిలను స్వాధీనం చేసుకున్నారు.

Hash oil supply gang arrest Hyderabad :రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు ఐదుగురు యువకులను అరెస్టు చేసి 5 కిలోల గంజాయి, 4 ఫోన్లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని సెయింట్‌ జోసఫ్‌ ఐటీఐ కళాశాలలో చదివే రజినీకాంత్‌ అనే విద్యార్థికి హైదరాబాద్‌లో ఆటో నడిపే.. నాగర్​కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం తుమ్మన్​పేటకు చెందిన సమీర్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది.

జల్సాలకు అలవాటు పడిన రజినీకాంత్‌ సమీర్‌తో కలిసి దిల్‌సుఖ్‌నగర్‌లో హాస్టళ్ల వద్ద సంచరిస్తూ గంజాయి విక్రయించేవారు. గంజాయికి బానిసలైన ముగ్గురు బీటెక్‌ విద్యార్థులు.. రజినీకాంత్‌, సమీర్‌కు డబ్బులిచ్చి మల్కన్‌గిరి గంజాయి తెప్పిస్తున్నారు. తీసుకొచ్చిన డ్రగ్స్‌ను తాము సేవిస్తూ మిగతా విద్యార్థులకూ అమ్ముతున్నట్లు ఎస్​వోటీ పోలీసులు గుర్తించారు.

గతంలో లారీల్లో టన్నుల కొద్దీ గంజాయి సరఫరా చేసే నిందితులు, నిఘా పెరగడంతో ద్విచక వాహనాలు, కార్లలో కిలోల కొద్దీ గంజాయి తెస్తున్నారని.. ఏ మార్గంలో గంజాయి, హాష్ ఆయిల్ సరఫరా చేసినా తెలిసిపోయేలా సమాచార వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు.

"వేర్వేరు చోట్ల గంజాయి, హాష్​ఆయిల్ తరలిస్తూ విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నాము. రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలను చేపడుతున్నాము. ఎవరైనా విక్రయించినా, కొనుగోలు చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం".- డీఎస్ చౌహాన్, రాచకొండ సీపీ

Police surveillance of ganja: రాష్ట్రంలో గంజాయి కట్టడిపై పోలీసుల ప్రత్యేక నిఘా..

Ganja Gang Arrested : కారు నంబరు ప్లేటు మారుస్తూ.. గంజాయి రవాణా చేస్తున్న ముఠా అరెస్టు

ABOUT THE AUTHOR

...view details