తెలంగాణ

telangana

ETV Bharat / state

Ganja Gangs in Hyderabad : హైదరాబాద్​లో గుప్పుమంటున్న గంజాయి.. మురికివాడలే అడ్డాలు.. టీనేజర్లే బాధితులు! - హైదరాబాద్​లో గంజా గ్యాంగ్ నేరాలు

Ganja Gangs in Hyderabad : హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో గంజాయి గుప్పుమంటోంది. శివారు ప్రాంతాలు, మురికి వాడలు, బస్తీలు, పారిశ్రామికవాడలను గంజాయి సరఫరాదారులు అడ్డాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆంధ్రా, ఒడిషా నుంచి గంజాయిని తీసుకొచ్చి చిన్న చిన్న పాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. గంజాయి సేవిస్తున్న వాళ్లు మత్తులో నేరాలకు పాల్పడుతుండటంతో నగర శివార్లలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి.

Marijuana Gang Crime in Hyderabad
City Outskirts Ganja Gang Halchal

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2023, 1:54 PM IST

Ganja Gangs in Hyderabad హైదరాబాద్​లో గుప్పుమంటున్న గంజాయి మురికివాడలే అడ్డాలు టీనేజర్లే బాధితులు

Ganja Gangs in Hyderabad : హైదరాబాద్‌ మీర్‌పేట్ పీఎస్​ పరిధిలో ఓ మైనర్‌పై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ అఘాయిత్యానికి మరో ఐదుగురు సహకరించారు. మంగళ్‌హాట్‌కు చెందిన రౌడీషీటర్ గంజాయి విక్రయం కోసం సమీపంలోని కాలనీలో అడ్డా ఏర్పాటు చేసుకున్నాడు. కూలీలు నివాసముండే బస్తీలో.. గంజాయి విక్రయిస్తూ డబ్బులు సంపాదించేందుకు మకాంను అక్కడికి మార్చుకున్నాడు. ఈ క్రమంలో కాలనీలో ఉండే బాలికపై కన్నేసి బెదిరించి సామూహిక అత్యాచారం చేశారు.

Ganja Gangs in Hyderabad City Outskirts :గత నెల అర్ధరాత్రి ఓ యువకుడిపై స్థానిక యువకులు గంజాయి మత్తులో బీరు సీసాలతో దాడి చేయగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బాధితుడు మృతి చెందాడు. మైలార్‌దేవ్‌పల్లి పీఎస్​ పరిధిలో మూణ్నెళ్ల క్రితం గంజాయికి బానిసైన వ్యక్తి డబ్బుల కోసం రోడ్డుపక్కన నిద్రిస్తున్న ఇద్దరిని రాయితో మోది హత్య చేశాడు. ఆసిఫ్‌నగర్‌లో గలాటా సృష్టించిన గంజాయి ముఠా.. పోలీస్ వాహనంపై ఎక్కి నానా హంగామా చేసింది. కాలాపత్తర్ పీఎస్ పరిధిలో గంజాయి సేవించిన ఓ వ్యక్తి నడిరోడ్డుపై అల్లరి చేస్తుంటే పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే.. కత్తితో చేయి కోసుకున్నాడు. పోలీసులు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఆ విధంగా హైదరాబాద్‌లో రోజూ ఏదో ఒకచోట గంజాయికి బానిసైన వాళ్లు శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు. బస్తీవాసులైతే గంజాయి ముఠాలను చూస్తేనే భయపడుతున్నారు.

Hyderabad Ganja Gang Arrested : హైదరాబాద్​లో గంజాయి గ్యాంగ్​ అరెస్ట్​.. నిందితుల్లో మైనర్​

Supplying Ganja From Other States : ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నుంచి భారీగా గంజాయి సరఫరా అవుతుండటంతోపోలీసులు నిఘా పెట్టారు. లారీలు, డీసీఎంలో క్వింటాళ్ల కొద్దీ సరకును తీసుకొస్తున్న ముఠాలను అరెస్ట్ చేస్తున్నారు. అయినా పోలీసుల కళ్లుగప్పి తీసుకొస్తున్న కొందరు మంగళ్‌హాట్, దూల్‌పేటకు చెందిన పాతనేరస్థులు గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలోకి మారుస్తున్నారు. 10 గ్రాముల గంజాయిని రూ.100కు విక్రయిస్తున్నారు.

Ganja supply gang arrest in Hyderabad : ఒడిశా నుంచి హైదరాబాద్​కు గంజాయి సరఫరా.. ముఠా అరెస్టు

Four of Family Arrested in Ganja Case : నానక్‌రామ్​గూడలో కిరాణా దుకాణాల్లో గంజాయి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్‌ చేసిన అధికారులు వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఉస్మానియా వర్సిటీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోనూ.. పలు చోట్ల విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించి.. నిఘా పెంచారు. హెరాయిన్, కొకైన్, ఎమ్డీఎమ్​ఏ వంటి మత్తు పదార్థాలు ధర ఎక్కువ కావడంతో.. కూలీలు, బస్తీల్లోని యువకులు గంజాయికి అలవాటుపడుతున్నారు. ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, రాజేందర్​నగర్, గండిపేటలోని ఇంజినీరింగ్, ఇతర కాలేజీలకు చెందిన విద్యార్థులను పలుమార్లు పోలీసులు అరెస్ట్ చేశారు. బస్తీలు, మురికివాడల్లో పోలీసులు నిఘా పెట్టారు.

"నగరంలో చిన్న చిన్న బస్తీల్లో అక్కడక్కడ గంజాయి చలామణి అవుతున్న విషయం మాకు కూడా తెలుసు. సప్లై చేయకుండా చూడటానికి ఫోకస్​ పెట్టాము. సప్లైయర్​ని పట్టుకుంటే ఇవన్ని ఆపోచ్చు. కాలేజీ దగ్గర్లో ఇలాంటివి కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. దీనివల్ల మత్తు పదార్థాలను నిర్మూలించవచ్చు." - డీఎస్ చౌహాన్, రాచకొండ కమిషనర్

మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల క్రయవిక్రయాల నిరోధానికి రాష్ట్ర నార్గోటిక్ విభాగం పోలీసులు కృషి చేస్తున్నారు. రెండు నెలల్లోనే దాదాపు రూ.26కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు మత్తు పదార్థాలకు బానిస అవ్వకూడదని సూచించారు.

Ganja Gang Arrest In Hyderabad : గంజాయి ముఠా అరెస్ట్.. 23.4కిలోల సరుకుతో పాటు రూ.40 లక్షల నగదు స్వాధీనం

NDPS Act on Ganja Smuggling Gang : అరెస్ట్​లు చేసినా తగ్గేదేలే.. గంజాయి గ్యాంగ్​ కోసం రూట్ మార్చిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details