Ganja Addiction Increased in Telangana :గంజాయి మహమ్మారి రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరించడం కలకలం రేపుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 2 లక్షల మంది గంజాయివ్యసనానికి బానిసలయ్యారని కేంద్రం విడుదల చేసిన నివేదికలో వెల్లడయింది. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 1.2 కోట్ల మంది దీని బారిన పడగా, 17 సంవత్సరాల లోపు మైనర్లలోనూ వీటి ఛాయలు (Minors Addicted Ganja in Telangana) కనిపిస్తున్నాయి. కేంద్రం విడుదల చేసిన నివేదికలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.
2 Lakh People Addicted to Ganja in Telangana :దేశవ్యాప్తంగా 18, 75 ఏళ్ల లోపు వారిలో 15.01 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు. కొకైన్ బారిన పడిన వారు 9.4 లక్షలు, అంపెటమైన వంటి నిషేదిత మత్తు పదార్ధాల తీసుకునేవారు 15.47 లక్షలు ఉన్నారు. గంజాయి వ్యసనపరులు 2.9 కోట్లు, నల్లమందు తీసుకునే వారు 1.86 కోట్లు, మత్తు మందు పీల్చే వారు 51.25 లక్షలు ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు. అత్యధికంగా గంజాయి వ్యసనపరులు ఉత్తర్‌ప్రదేశ్‌లో 1.2 కోట్ల మంది ఉన్నట్టు వెల్లడయింది.
బోల్తా కొట్టిన కారు - బయటపడిన 2 క్వింటాళ్ల గంజాయి, ఎక్కడంటే?
Youth Addicted Ganja in Telangana :తెలంగాణలో గంజాయి వ్యసనపరులు 18 లోపువారు 10 వేల మంది కాగా, 18 నుంచి 75 సంవత్సరాలు వయసువారు 1.90లక్షల మంది ఉన్నారు. నిద్రమాత్రలు తీసుకుంటున్నవారు 18 ఏళ్ల లోపువారు 36 వేలు, 18 నుంచి 75 సంవత్సరాల వయసు కలిగినవారు 16.63 లక్షల మంది ఉన్నారు. ఓపియం తీసుకుంటున్న 18 సంవత్సరాల లోపువారు 98 వేలు, 18 నుంచి 75 ఏళ్ల లోపువారు 5.47 లక్షల మంది ఉన్నారు. కొకైన్ తీసుకుంటున్నవారు 18 సంవత్సరాల లోపువారు 2900, 18 నుంచి 75 ఏళ్ల లోపు వారు 22 వేల మంది ఉన్నారు.