హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా గంగపుత్రులు ఆందోళన నిర్వహించారు. చేపలు పట్టే వృత్తి జన్మ హక్కుగా గంగపుత్రులకే ఉందని... ఇలాంటి వృత్తిని తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జీవో నంబర్ 6ను తీసుకువచ్చి చేపలు ఎవరైనా పట్టుకోవచ్చని చెప్పడం అత్యంత దుర్మార్గమని తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మల్లయ్య ఆరోపించారు. మంత్రి ఈటల రాజేందర్ సైతం ముదిరాజులకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.
జీవో నంబర్ 6ను రద్దు చేయాలి: గంగపుత్రులు - హైదరాబాద్ వార్తలు
చేపలు పట్టే వృత్తి తమకు మాత్రమే సొంతమని గంగపుత్రులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజులకు వత్తాసు పలుకుతూ తమకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే జీవో నంబర్ 6ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
![జీవో నంబర్ 6ను రద్దు చేయాలి: గంగపుత్రులు gangaputras protest at tankbund on go 6](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10689280-thumbnail-3x2-putra.jpg)
జీవో నెంబర్ 6ను రద్దు చేయాలి: గంగపుత్రులు
ప్రభుత్వం తక్షణమే బోగస్ సొసైటీ సంఘాలను రద్దు చేసి... చెరువులపై పూర్తి హక్కు గంగపుత్రులకే ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గంగపుత్రులపై ముదిరాజ్లు చేస్తున్న దాడులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 6ను రద్దుచేయకపోతే భవిష్యత్లో తెరాసకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:కరోనాకు పతంజలి 'కొరొనిల్ టాబ్లెట్'