తెలంగాణ

telangana

ETV Bharat / state

'భీష్మ' సినిమా టైటిల్​పై గంగపుత్రుల అభ్యంతరం - bhishma movie trailer

'భీష్మ' చిత్రం టైటిల్​ను మార్చాలని తెలంగాణ గంగపుత్ర చైతన్య సమితి డిమాండ్​ చేసింది. ఇవాళ చైతన్య సమితి సభ్యులు ఫిల్మ్​నగర్​లోని ఫిల్మ్​ చాంబర్​ కార్యాలయాన్ని ముట్టడించారు.

Gangaputra's objection to the title of 'Bhishma' movie in hyderabad
'భీష్మ' సినిమా టైటిల్​పై గంగపుత్రుల అభ్యంతరం

By

Published : Feb 17, 2020, 8:42 PM IST

భీష్మ సినిమా టైటిల్ మార్చాలని తెలంగాణ గంగపుత్ర చైతన్య సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఫిల్మ్ నగర్​లోని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ కుల దైవం భీష్మ పితామహుడు తండ్రి మాటకు కట్టుబడి వివాహం చేసుకోకుండా ఆదర్శంగా నిలిచారని... ఇప్పుడు భీష్మ సినిమా పేరిట అసభ్యకర దృశ్యాలతో మా మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూస సత్య నారాయణ బెస్త ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా పేరును మార్చకుంటే హైదరాబాద్​లో పెద్ద ఎత్తున ఉన్న తమ కులస్తులతో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జీవో తెచ్చి తమ నడ్డి విరిచిందనీ...ఇప్పుడు సినిమా ముసుగులో తమ కుల దైవం భీష్ముడిని అవమానిస్తున్నారని చైతన్య సమితి ప్రధాన కార్యదర్శి మంగిలిపల్లి శంకర్ బెస్త అన్నారు.

'భీష్మ' సినిమా టైటిల్​పై గంగపుత్రుల అభ్యంతరం

ఇవీ చూడండి: భీష్మ ట్రైలర్: అదృష్టవంతుడితో పోరాడి గెలవలేం

ABOUT THE AUTHOR

...view details