తెలంగాణ

telangana

ETV Bharat / state

గంగపుత్ర సంఘాల ఆందోళన బాట

గంగపుత్రుల సమస్యల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెుండి వైఖరిని నిరసిస్తూ తెలంగాణ గంగపుత్ర సంఘాల ఐక్యవేదిక నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఇందిరాపార్కులోని ధర్నా చౌక్​లో​ ఒక్క రోజు నిరాహార దీక్ష చేశారు.

By

Published : Feb 29, 2020, 10:41 PM IST

Updated : Mar 3, 2020, 2:21 AM IST

gangaputra society protest
గంగపుత్ర సంఘాల ఆందోళన బాట

హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్​లో​ గంగపుత్ర సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గంగపుత్రులు ఒక్క రోజు నిరాహార దీక్ష చేశారు. రాష్ట్రంలోని అన్ని చెరువులపై తమ కులస్థులకే హక్కులు కల్పించాలని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్. లక్ష్మణ్ బెస్త డిమాండ్ చేశారు. జీవో 6ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్​పై వేద వ్యాస్, భీష్మతో పాటు గంగపుత్ర సంఘం వ్యవస్థాపకులు బాలయ్య బెస్త విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు.

నెక్లెస్ రోడ్​లో గంగామాత ఆలయం నిర్మించాలని ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు టీ.సత్యం బెస్త డిమాండ్​ చేశారు. గంగపుత్ర సొసైటీలో 90 శాతం ఉద్యోగాలు తమ కులానికి చెందిన వారికే కేటాయించాలన్నారు. తమ సొసైటీల్లో ఇతర కుల నాయకులు, రాజకీయ నేతల జోక్యం ఉండరాదని స్పష్టం చేశారు.

గంగపుత్ర సంఘాల ఆందోళన బాట

ఇదీ చదవండి:ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

Last Updated : Mar 3, 2020, 2:21 AM IST

ABOUT THE AUTHOR

...view details