తెలంగాణలో గంగపుత్ర కులాన్ని లేకుండా చేసేందుకు పాలకులు కుట్ర పన్నుతున్నారని ఆ సంఘం కన్వీనర్ బిజ్జ లక్ష్మణ్ ఆరోపించారు. తమ కులాన్ని భూస్థాపితం చేసి మరో సామాజిక వర్గానికి మేలు చేసేలా మంత్రులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఏం చేయాలి..
చెరువులపై ముదిరాజులకు హక్కు ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు నిరసనగా.. హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. కులవృత్తిగా చేపలు పడుతున్న గంగపుత్రులు ఏం పని చేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ సామాజికవర్గానికి మేలు చేసేందుకు మరొకరిని అణిచివేయడం భావ్యం కాదని విమర్శించారు.