Fake Documents Gang Arrested in Hyderabad : మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాలకు చెందిన రియల్టర్ ధర్మేందర్రెడ్డి అలియాస్ ధర్మారెడ్డి, యాదాద్రి జిల్లా బీబీనగర్‌కు చెందిన వ్యాపారి సత్తిరెడ్డి నకిలీ దందా ప్రధాన సూత్రధారులని పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన సయ్యద్ నజీర్.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు చేయడంలో సిద్ధహస్తుడు. ఇటీవల నజీర్ మరణించాడు.
Fake Documents Gang Arrest :ఖాళీగా యజమానుల పర్యవేక్షణ లేని భూముల్ని గుర్తిస్తున్న దొంతి సత్తిరెడ్డి.. ఆ సమాచారాన్ని ధర్మారెడ్డికి చెబుతాడు. వాారి ఆదేశాల అనుగుణంగా సయ్యద్ నజీర్ వాటికి నకిలీ పత్రాలను సష్టిస్తాడు. ఆ భూముల యజమానుల్లా నమ్మబలికి అమాయకులకు వాటిని అంటగడతారు. భూములు గుర్తించడం, వాటి పత్రాల తయారీ, అసలు యజమానుల్లా నటించేందుకు నకిలీవ్యక్తులు, సాక్షులు ఇలా అన్నీ పక్కాగా చేస్తారని పోలీసులు వివరించారు.
ఇటీవల యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం రాఘవాపురంలో 2 వేల 420 చదరపు గజాల్లోని రెండు ప్లాట్లపై ఈ ముఠా కన్నుపడింది. కొన్నేళ్లుగా యజమాని పట్టించుకోని ఈ స్థలానికి నకిలీ భూ పత్రాలు వారు సృష్టించారు. జీపీఏ సమయంలో ఈ స్థలాల యజమానులుగా నటించేందుకు మరో నిందితుడు షౌకత్ అలీ వ్యక్తుల్ని తీసుకొచ్చాడు. రాము, రాములు, గొర్రె రమేశ్ భూ యజమానుల్లా నటించారు.