తెలంగాణ

telangana

ETV Bharat / state

దిశ హత్యాచార ఘటన మరవకముందే.. ఏపీలో మరొకటి... - వేమవరంలో 50 ఏళ్ల మహిళపై అత్యాచారం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం మరవకముందే అలాంటి దారుణ ఘటనే ఏపీలో చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం జి.వేమవరంలో 50 ఏళ్ల మహిళపై దుండగులు సామూహిక అత్యాచారం చేసి హతమార్చారు.

rape
rape

By

Published : Dec 3, 2019, 3:05 PM IST

Updated : Dec 3, 2019, 3:14 PM IST

50 ఏళ్ల ముదుసలి వదల్లేదు ఆ దుర్మార్గులు. దిశ హత్యాచారం మరవకముందే పొరుగు రాష్ట్రంలో మరో ఘటన చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం జి.వేమవరంలో 50 ఏళ్ల మహిళపై దుండగులు సామూహిక అత్యాచారం చేసి హతమార్చారు.

ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరి కోసం గాలింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మృతురాలి భర్త, కుమారుడు గతంలో మృతి చెందగా, కుమార్తె హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నారు. సాయంత్రంలోగా కేసును ఛేదిస్తామని ఎస్పీ తెలిపారు.

దిశ అత్యాచర ఘటన మరవకముందే.. ఏపీలో మరొకటి...
Last Updated : Dec 3, 2019, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details