తెలంగాణ

telangana

ETV Bharat / state

పిల్లలను విక్రయిస్తున్న ముఠా పట్టివేత - Gang abduction of children in hyderabad

పిల్లలను అపహరిస్తున్న ముఠాను అల్వాల్​ పోలీసులు పట్టుకున్నారు. తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి వారి నుంచి పిల్లలను తీసుకెళ్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

Gang abduction of children in hyderabad
పిల్లలను విక్రయిస్తున్న ముఠా పట్టివేత

By

Published : Feb 6, 2020, 7:01 PM IST

పిల్లలను విక్రయిస్తున్న ముఠా పట్టివేత

సికింద్రాబాద్​లో పేద వర్గాలకు చెందిన పిల్లలను టార్గెట్​గా చేసుకొని ఓ ముఠా అపహరణకు పాల్పడుతోంది. పసిమొగ్గల తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి వారి నుంచి పిల్లలను తీసుకెళ్లి అమ్ముతున్న ఏడుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

అసలేం జరిగిందంటే?

గత నెల 27న అల్వాల్​ పీఎస్​ పరిధిలో ఓ చిన్నారి అపహరణకు గురైంది. ఇద్దరు మహిళలు పిల్లలను మారుస్తూ.. ఉండగా ఎస్​ఓటీ, అల్వాల్​ పోలీసులు సంయుక్తంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ పద్మజ వెల్లడించారు. వారిని శమంతకమణి, రేణుకగా గుర్తించారు. బాబురెడ్డి, గంగాధర్​ రెడ్డి ఇద్దరు ప్రధాన సూత్రధారిగా ఈ ముఠాకు నాయకత్వం వహిస్తూ... పిల్లలను అపహరిస్తున్నారని డీసీపీ స్పష్టం చేశారు.

మరొకరు పరారీలో...

బాబురెడ్డి అనే వ్యక్తి కడప జిల్లాకు చెందగా... గంగాధర్​రెడ్డి ఈస్ట్​ గోదావరి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నగరంలో ఉంటూ... ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు. బాబురెడ్డి, గంగాధర్​రెడ్డిపై నగరవ్యాప్తంగా కేసులు ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఈ ఇద్దరికి రమేశ్​, రాజా, నాయక్​, శమంతకమణి, రేణుక సహకరించే వారని తెలిపారు. వీరంతా కలిసి ఇంట్లో ఉన్న సమయంలో పోలీసులు మరో పాపను గుర్తించారు. చిన్నారులను రెస్క్యూ హోంకు తరలించినట్లు డీసీపీ చెప్పారు. నిందితుల్లో లక్ష్మి అనే మహిళ పరారీలో ఉందని మిగిలిన వారిని రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: 'మహా'వస్థ: మేడారంలో తాగునీటి తండ్లాట!

ABOUT THE AUTHOR

...view details