రాజ్‌భవన్‌లో ప్రతిష్టించిన విఘ్నేశ్వరున్ని నిమజ్జనం చేశారు. అంతకుముందు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన భర్తతో కలిసి వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు... రాజ్‌భవన్ ప్రాంగణంలో ఉన్న చేపల కొలనులో గణపతిని నిమజ్జనం చేశారు.
రాజ్‌భవన్‌లోని వినాయకుని నిమజ్జనం - Ganesha idol immersion held at Raj Bhavan at Hyderabad
రాజ్‌భవన్‌లో ప్రతిష్టించిన గణనాథున్ని ప్రత్యేక వూజల అనంతరం నిమజ్జనం చేశారు. మూడో రోజు కావడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వినాయకుడి నిమజ్ఞనాలు చేశారు.
రాజ్‌భవన్‌లోని వినాయకుని నిమజ్జనం
మూడో రోజు కావడం వల్ల జంట నగరాల్లో భక్తిశ్రద్ధలతో భక్తులు వినాయకుని నిమజ్ఞనాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ పరిశీలించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. నిమజ్జనం కార్యక్రమం చేసుకోవాలని భక్తులను కోరారు.
ఇదీ చూడండి:నెమ్మదించిన కృష్ణమ్మ.. నాగార్జునసాగర్‌కు తగ్గిన వరద