Ganesh Nimajjanam Hyderabad 2023 :హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాన్ని ఏ శక్తి ఆపలేదని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి స్పష్టం చేసింది. ఎవరైనా అడ్డుకునేందుకు యత్నిస్తే ట్యాంక్‌బండ్ వద్ద ధర్నా చేపడుతామని ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు హెచ్చరించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి(Bhagyanagar Ganesh Utsav Committee) అసెంబ్లీ, డివిజన్ కన్వీనర్లు, గణేశ్ మండప నిర్వాహకులు, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ చౌహన్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. నిమజ్జనం రోజు చేపట్టాల్సిన పనులను ఉత్సవ కమిటీ సభ్యులు ఆయా శాఖల దృష్టికి తీసుకెళ్లారు.
"ఎలాంటి ఏర్పాట్లు చేసినా.. చేయకపోయిన ప్రపంచంలో వినాయక నిమజ్జనాన్ని ఎవరు అడ్డుకోలేరు. బేగం బజార్లో వినాయక విగ్రహాలు ఎక్కువగా ఉంటాయి. భద్రాతా ఏర్పాట్లుపై లోకల్ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్తే.. ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఇది నిర్లక్ష్యమా? అలసత్వమా? అని జీహెచ్ఎంసీ కమిషనర్ని అడుగుతున్నా." - భగవంతరావు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ప్రధాన కార్యదర్శి
నిమజ్జనంపై గందరగోళం వద్దు.. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు జరుగుతున్నాయన్న తలసాని
Ganesh Nimajjanam Arranagments Hyderabad 2023 : గణేశ్ నిమజ్జనం(Ganesh immersion) కోసం హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం ఏర్పాట్లు, రూట్‌మ్యాప్ సిద్ధం చేసేందుకు విగ్రహాలను ప్రతిష్టించడానికి ముందే నిర్వాహకులతో ఇంటిమేషన్ ఫామ్ తీసుకున్నట్లు రాచకొండ సీపీ చౌహాన్ తెలిపారు.