తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో లడ్డూ వేలం పాటలో సరికొత్త రికార్డ్.. ధర రూ.60.80లక్షలు - రిచ్​మండ్ విల్లా కాలనీ తాజా వార్తలు

RICHMOND VILLA LADDU RECORD: గణేశ్​ లడ్డూ వేలంపాట అనగానే అందరూ ఎక్కువగా బాలాపూర్​ లడ్డూ గురించే మాట్లాడుకుంటారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం తన రికార్డును తానే బ్రేక్​ చేసుకుంటూ బాలాపూర్​ లడ్డూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది కాబట్టి. అయితే ఈసారి మాత్రం బాలాపూర్​ లడ్డూ ధరను శనివారం అల్వాల్ లడ్డూ దాటేయగా.. ఇవాళ బండ్లగూడలో వేసిన వేలం రాష్ట్రంలోని కొత్త రికార్డ్ సృష్టించింది. ఏకంగా బాలాపూర్, అల్వాల్​​ లడ్డూను దాటేసింది.

రాజేంద్రనగర్
రాజేంద్రనగర్

By

Published : Sep 11, 2022, 10:51 PM IST

RICHMOND VILLA LADDU RECORD: రాజేంద్రనగర్ బండ్లగూడ పరిధిలోని రిచ్​మండ్ విల్లా కాలనీలో లడ్డూ ధర రాష్ట్రంలోనే కొత్త రికార్డు క్రియేట్​ చేసింది. ఏకంగా బాలాపూర్​ లడ్డూ, అల్వాల్​ మరకత లక్ష్మీగణపతి లడ్డూ ధరనే దాటేసింది. ఈరోజు జరిగిన వేలంలో ఎవరూ ఊహించని రీతిలో లడ్డూ ధర రూ.60.80లక్షలు పలికింది. డాక్టర్ సాజీ డీసౌజా బృందం ఇంత భారీ మొత్తం వెచ్చించి లడ్డూను సొంతం చేసుకున్నారు.

గణనాథుని లడ్డూను దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సాజీ డీసౌజా తెలిపారు. కులం, మతం కన్నా మానవత్వమే ముఖ్యమని అన్నారు. లడ్డూ వేలం పాటలో వచ్చిన డబ్బులను.. ఆర్​వీ దియా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా సికింద్రాబాద్​ పరిధిలోని అల్వాల్​ మరకత లక్ష్మీగణపతి లడ్డూను రూ.46 లక్షలకు వెంకట్రావు దంపతులు, బాలాపూర్​ లడ్డూను రూ.24 లక్షల 60 వేలకు ఉత్సవ సమితి సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్న విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details