తెలంగాణ

telangana

ETV Bharat / state

నిమజ్జన క్రతువు పరిశీలించిన డిప్యూటీ మేయర్​, సీపీ - ganesh immersion event

భాగ్యనగరంలో గణేశ్​ నిమజ్జనం అంగరంగ వైభవంగా సాగుతోంది. కూకట్​పల్లిలోని ఐడియల్​ చెరువు వద్ద నిమజ్జన కార్యక్రమాన్ని నగర డిప్యూటీ మేయర్​ ఫసీయుద్దీన్​, సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ పరిశీలించారు.

సైబరాబాద్​ సీపీ

By

Published : Sep 12, 2019, 7:35 PM IST

హైదరాబాద్​ కూకట్​పల్లి ఐడియల్ చెరువు వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నగర డిప్యూటీ మేయర్​ బాబా ఫసీయుద్దీన్​, సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ పరిశీలించారు. నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి చెరువు వద్ద బై.. బై.. గణేశా అంటూ భక్తులు భక్తి భావంతో విగ్రహాలను నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం వరకూ 5 వేలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశామని... ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని డిప్యూటీ మేయర్​ ఫసీయుద్దీన్​ తెలిపారు. సైబరాబాద్​ పరిధిలో 11 వేల గణనాథుల నిమజ్జనాలు పూర్తయ్యాయని సీపీ సజ్జనార్​ పేర్కొన్నారు. ప్రజలందరూ శాంతియుతంగా నిమజ్జన వేడుకల్లో పాల్గొనాలని సూచించారు.

నిమజ్జన క్రతువు పరిశీలించిన డిప్యూటీ మేయర్​, సీపీ

ABOUT THE AUTHOR

...view details