హైదరాబాద్ బోయినపల్లిలోని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడు అందరినీ ఆకట్టుకున్నాడు. నిమజ్జనం సందర్భంగా గణనాథునికి చేసిన అలంకరణ భక్తులకు కనువిందు చేసింది. మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గణేశుని విగ్రహాన్ని ఊరేగించారు. ఏనుగులు, వేషధారులు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి భారీ విగ్రహాలు ముందు వెళ్లగా వెనుక బొజ్జ గణపయ్యను నిమజ్జనానికి తరలించారు. చిన్నా,పెద్ద అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. రకరకాల విద్యుత్ దీపాల అలంకరణలతో బోయినపల్లి వీధులు కాంతులు వెదజల్లాయి.
బోయినపల్లిలో వైభవంగా గణేశుని శోభాయాత్ర - గణేశ్ శోభాయాత్ర
నవరాత్రులూ భక్తుల పూజలందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలివెళ్తున్నారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య ఆధ్యాత్మికత వెల్లి విరియగా వెళ్లిరా గణపయ్యా... అంటూ భక్తులు ఏకదంతుడికి వీడ్కోలు పలుకుతున్నారు. హైదరాబాద్ బోయినపల్లిలోని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జనం కార్యక్రమం ఘనంగా సాగింది.
![బోయినపల్లిలో వైభవంగా గణేశుని శోభాయాత్ర](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4407347-thumbnail-3x2-ganeshgupta.jpg)
గణేశ్ నిమజ్జనం