GANESH IMMERSION ARRANGEMENTS: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్‌సాగర్ చూట్టూ నిమజ్జనం నిమిత్తం 22 క్రేన్లను ఏర్పాటు చేశారు. అనంతరం వ్యర్థాల వెలికితీతకు 20 జేసీబీలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సాగర్ పరిసర ప్రాంతాలలో 12వేల మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. శోభాయాత్ర మార్గంలో అత్యవసర సహాయ కేంద్రాలు , వైద్యశిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
శోభాయాత్ర సందర్భంగా పాతబస్తీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. దాదాపు 2500మంది పోలీసులతో భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. షా అలీ బండ, అలియాబాద్, లాల్‌దర్వాజ, ఫలక్‌నుమా, నాగుల్ చింత, చాంద్రాయణగుట్ట, హుస్సేనీ ఆలం లాంటి సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను కేటాయించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే తక్షణ అవసరంగా మరిన్ని బలగాల్ని అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.