వినాయక నవరాత్రులు పూర్తి కావడంతో వినాయక ప్రతిమలు గంగమ్మ వడికి చేరుతున్నాయి. హైదరాబాద్ గుడిమల్కాపూర్ నవోదయ కాలనీలోని ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భక్తి శ్రద్ధలతో నవరాత్రి పూజలు నిర్వహించారు.
ఆంజనేయ స్వామి గుడిలోనే గణనాథుని నిమజ్జనం - latest news of ganesh idol immersion at hanuman temple
భాగ్యనగరంలో అత్యంత వైభంగా నవరాత్రి పూజలందుకున్న వినాయక విగ్రహాల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. గుడిమల్కాపూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుని ఆలయ కమిటీ సభ్యులు గుడిలోనే నిమజ్జనం చేశారు.

ఆంజనేయ స్వామి గుడిలోనే గణనాథుని నిమజ్జనం
ఆఖరి రోజున జరిపే గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని ఆలయంలోనే చిన్నపాటి కొలను ఏర్పాటు చేసి వైభవంగా పూర్తి చేశారు. నిమజ్జనం ద్వారా వెలువడిన మట్టి నీటిని ప్రజలకు పంపిణీ చేస్తారు. భక్తితో వాటిని ప్రజలు తులసి మొక్కలకు వేస్తారు.
ఇవీ చదవండి:శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు సీజే మహేశ్వరి
TAGGED:
గుడిలోని వినాయకుని నిమర్జనం