Ganesh Festival 2023 : గణేశ్ చతుర్ది.. ప్రజలకు ఆనందాన్నే కాదు... ఆరోగ్యాన్ని పంచే పండుగ. పర్యావరణ పరిరక్షణ పరమార్థాన్ని చాటుతూ ఏటా ప్రజలను మేల్కొలుపుతుంటుంది ఈ పండుగ. చుట్టూ ఉండే ప్రకృతిని, సహజవనరులను పరిరక్షించుకుందామని పిలుపునిచ్చే ఈ పండుగ.. పల్లె నుంచి పట్నం వరకు ఎంతో జోరుగా సాగుతుంటుంది. కొందరు తొమ్మిదిరోజులు మరికొందరు 11 రోజులుబొజ్జ గణపయ్యను నిత్యపూజలతో (Ganesh Festival 2023) ఆరాధిస్తుంటారు. అయితే ఆ ఆరాధన.. గ్రామీణ ప్రాంతాల్లోని కులవృత్తులకు చేయూత నివ్వాలంటున్నారు... బాధ్యత ఫౌండేషన్ వ్యవస్థాపకులు పైడిమర్రి చంద్రశేఖర్. పండుగ పైసలు పల్లెలలకు ఇద్దామని పిలుపునిస్తూ పట్టణ వాసులను మేల్కొలుపుతుంటారు. చవితి పండుగ కోసం కొనుగోలు చేసే వినాయక ప్రతిమలను కుమ్మరుల వద్ద, పూజ కోసం ఉపయోగించే వస్త్రాలను నేతన్నల వద్ద కొనుగోలు చేసి ఆసరాగా ఉందమని పిలుపునిస్తున్నారు.
"గ్రామాలు పట్టుకొమ్మలని అందరికి తెలుసు. పండగ రోజు పట్నం డబ్బులు పల్లెకి ఇచ్చి పుణ్యం చేసుకుందాం అనే నినాదంతో గ్రామప్రజలకు ఆదాయ మార్గాన్ని చూపించాలి అని ఇది మొదలు పెట్చాను. ఇంటర్నెట్లో కొనుగోలు చేస్తే కార్పొరేట్‌కి ఆదాయం వెళుతుంది. అలా ఎందుకు పల్లెవారికి ఆదాయాలు రావాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. 2014 నుంచి ఈ నినాదాన్ని మేను పాటిస్తున్నాము." - పైడిమర్రి చంద్రశేఖర్, వ్యవస్థాపకుడు బాధ్యత ఫౌండేషన్
Badhyatha Foundation: మాటల్లో కాదు ఆచరణలోనూ చంద్రశేఖర్ (Badhyatha Foundation)అమలు చేసి చూపిస్తున్నారు. తన బాధ్యత ఫౌండేషన్ ద్వారా సుమారు 22 గ్రామాల నుంచి 9 ఏళ్లుగా 33 రకాల పూజా వస్తువులు, 21 రకాల పత్రిలను సేకరించి పట్టణ ప్రజలకు అందిస్తున్నారు. తద్వారా ఆయా గ్రామాల్లోని కులవృత్తిదారులు, మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారు.
Prathidwani : ఏకదంతుడి పుట్టినరోజుని.. పర్యావరణహితంగా జరుపుకోవడం ఎలా..?