కరోనా వైరస్ విజృంభిస్తున్నందున స్వీయ నియంత్రణ, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేశ్ చతుర్థి పండుగ నిర్వహించుకోవాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు అన్నారు. సామూహిక పూజలు, నిమజ్జనాలు వద్దని కోరారు. గణేశ్ మండప నిర్వాహకులపై పోలీసులు వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు.
'భౌతిక దూరం పాటిస్తూ వినాయక చవితి జరుపుకుందాం' - vhp telangana state president ramaraju on ganesh chaturthi celebrations
భౌతిక దూరం పాటిస్తూ వినాయక చవితి పండుగను నిర్వహించుకోవాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు అన్నారు. గణేశ్ మండప నిర్వాహకులపై పోలీసులు వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో భౌతిక దూరం పాటిస్తూ వినాయక చవితి
కరోనా తరుణంలోనే జరుపుకున్న శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, బోనాల పండుగల మాదిరిగా వినాయక చవితి జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జిల్లాల్లో ఉత్సవ నిర్వాహకులను పోలీసులు వేధిస్తున్నారని, గ్రామానికి ఒకటే విగ్రహం ఏర్పాటు చేయాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం చవితి ఉత్సవాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తామని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి :యాదాద్రి ఆలయ నగరిలో పెద్ద అక్వేరియం