తెలంగాణ

telangana

ETV Bharat / state

Ganesh Chaturthi 2023 : మానవ కోటికి వినాయక చవితి చాటి చెప్పే సందేశం ఏమిటి?

Ganesh Chaturthi Festival 2023 : వినాయక చవితి వచ్చేసింది. ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు దేశమంతా ఇక సంబరమే సంబరం. పూజలు, భజనలు, ప్రసాదాలు, ఊరేగింపులతో వీధి వీధిలో సందడే. అయితే ప్రతి పండగకూ ఓ ప్రత్యేకత ఉండగా, వినాయక చవితికి అంతకు మించిన ప్రత్యేకత ఉంది. అనేక వైద్య రహస్యాలు సైతం ఈ పండగలో దాగి ఉన్నాయి. పర్యావరణం నుంచి వ్యాపారాల వరకు అనేక అంశాలు ఈ పండగతో ముడిపడి ఉన్నాయి. కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలకు చవితి వేడుకలు వేదికగా నిలుస్తాయి. ఎంతో మందికి ఈ వేడుకలు ఉపాధిని కూడా కల్పిస్తాయి. మరి అవి ఏ రూపంలో సాగుతాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు చవితి వేడుకలు ఏ రూపంలో చేయూతను అందిస్తాయి.

Ganesh Chaturthi
Ganesh Chaturthi 2023

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2023, 11:01 PM IST

Updated : Sep 18, 2023, 5:51 AM IST

Ganesh Chaturthi 2023 మానవ కోటికి వినాయక చవితి చాటిచెప్పే సందేశం ఏమిటి

Ganesh Chaturthi Festival 2023 : సమాజాన్ని మేల్కొలిపి అందరిలో ఐక్యతా భావనను కల్గించే పండగ వినాయక చవితి. ఐక్యతలోని ప్రయోజనాలనూ చాటిచెబుతుంది ఈ పండగ. ఆచారాలు, సంప్రదాయాల పేరుతో మంచి పనులను అడుగడుగునా కళ్లకు కడుతుంది. మానవ జీవితం ప్రకృతితో ముడిపడి ఉందని నిరూపిస్తుంది వినాయకచవితి(Ganesh Chaturthi). ఇప్పుడంటే రంగురంగుల విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నా.. పూర్వ కాలంలో మట్టి విగ్రహాలనే పూజించేవారు.

ఇది ప్రకృతికి ఎలాంటి హానీ తలపెట్టదు. మట్టితో తయారు చేసినవి నీటిలో తేలికగా కరిగిపోతాయి. నీరు ఏ విధంగానూ కలుషితం కాదు. రంగుల విగ్రహాల తయారీలో కాల్షియం సల్ఫేట్‌ అనే రసాయనాన్ని వాడతారు. దీన్ని జిప్సం అని కూడా అంటారు. దీనిని వేడి చేస్తే వచ్చే పదార్థమే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌(Plaster of Paris). ఇది నీటిలో కరగదు. విగ్రహాలకు కోబాల్ట్‌ ఆక్సైడ్‌, ఫెర్రిక్‌ ఆక్సైడ్‌ వంటి పదార్థాల మిశ్రమాన్ని రంగులుగా వాడుతారు. వీటిలో పాదరసం కూడా ఉంటుంది. వీటి వల్ల నీరు కలుషితమై నిమజ్జనం చేసే చెరువులు, కుంటల్లోని జలచరాలు ప్రాణాలు కోల్పోతాయి. మానవులు, ఇతర జీవులపై దీని ప్రభావం దీర్ఘకాలంలో ఉంటుంది.

Ganesh Chaturthi 2023 Telangana : జై బోలో మట్టి గణపతికీ.. మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడదాం

Why do They doGanesh Chaturthi :రంగుల విగ్రహాల వల్ల పర్యావరణానికి జరుగుతున్న ముప్పు వల్ల దేశమంతా మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలనే ప్రచారం ప్రతి ఏటా వినాయక చవితి(Ganesh chatrthi Festival)కి ముందు విస్తృతంగా సాగుతుంది. చిన్న విగ్రహాలు మొదలు పెద్ద వాటి వరకు మట్టి విగ్రహాలే ప్రతిష్ఠించేలా అనేక సంస్థలు పని చేస్తున్నాయి. పర్యావరణహితం కోరి మట్టి విగ్రహాలనే పూజించాలని చైతన్యం తెస్తున్నారు.

21 పత్రాలతో వినాయకుడికి పూజలు : వినాయక చవితి సందర్భంగా బిల్వ, శమి సహా 21 పత్రాలతో పూజ చేస్తారు. దీని వెనుక పర్యావరణ రహస్యం కూడా దాగి ఉంది. పూజల తర్వాత వినాయక విగ్రహాలను నదులు, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. దీని వల్ల అవి కలుషితం అవుతాయి. వినాయకుడికి సమర్పించే 21 ఆకుల వల్ల నీరు కాలుషితం కాదు. విగ్రహంతో పాటు నీటిలో వేసే ఈ పత్రాలు 23 గంటల తర్వాత తమలోని ఔషధ గుణాలు కల్గిన ఆల్కలాయిడ్స్‌ను వదిలి.. బాక్టీరియాను నిర్మూలించి జలాల్లోని ఆక్సిజన్‌ పరిమాణాన్ని పెంచుతాయి. ఇక 21 పత్రాలతో పూజించడం వల్ల అవి కొత్త మట్టితో కలిసి వీచే గాలి మనలోని అనారోగ్యాలను హరిస్తుంది.

Clay Ganesh Idols Telangana : ప్రకృతిని ప్రేమిద్దాం.. మట్టి గణపయ్యను పూజిద్దాం

Vinayaka Chaturthi 2023 in Telugu : వినాయక చవితి సందర్భంగా అనేక వ్యాపార లావాదేవీలు సాగుతాయి. విగ్రహాల తయారీ, అమ్మకాలు, వాటి తరలింపునకు వాహనాలు, క్రేన్లు, మండపాల ఏర్పాటు, అలంకరణ, బ్యాండ్‌ బృందాలు ఇలా అనేకం ఉంటాయి. వీటిపై ఆధారపడి దేశవ్యాప్తంగా కోట్ల మంది పని చేస్తూ ఉంటారు. వినాయక చవితి వచ్చిందంటే వీరందరికీ పని దొరికినట్లే. ఇక ఆయా కార్యకలాపాల వల్ల వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగుతుంది. విగ్రహాల తయారీదారులు అయితే ఆరు మాసాల ముందే పని ప్రారంభిస్తారు. కొందరు ఏడాది పొడవునా అదే పనిలో ఉంటారు. గత ఏడాది వినాయక చవితి సందర్భంగా రూ.300 కోట్ల వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ తెలిపింది. కేవలం విగ్రహాల వ్యాపారమే రూ.20 కోట్ల పైనేనని వెల్లడించింది. ఈ ఏడాది విగ్రహాల వ్యాపారం గత ఏడాది కంటే ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.

"ఆగమ శాస్త్రం మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని చెబుతుంది. మట్టితో చేసిన విఘ్నేశ్వరుడిని చెరువుల్లో నిమగ్నం చేస్తే.. అప్పటికే చెరువుల్లో కొత్త నీరు చేరి అందులో బాక్టీరియా వంటి క్రిములు చేరుతాయి. మట్టి నీటిలో కరగడం వల్ల అందులోని క్రిములు నాశనం అవుతాయి. ఔషధగుణాలు కలిగిన 21 పత్రాలు నీటిలో వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి."- బ్రహ్మశ్రీ పులుపుల వేంకట ఫణికుమార శర్మ

Ganesh Chaturthi 2023 in Telangana :వినాయక చవితి వేడుకలు మనుషుల్లో ఐక్యతను పెంచుతాయి. బాధ్యతలను, సేవా భావాన్ని చాటి చెబుతాయి. దేశవ్యాప్తంగా వీధివీధిలో మండపాలు వెలుస్తాయి. ఏ వీధికి ఆ వీధిలో స్థానికులు అంతా కలిసి వేడుకలు నిర్వహించుకుంటారు. అంతా కలిసి మెలిసి పండగ చేసుకుంటారు. ప్రతిష్ఠాపన మొదలు విగ్రహ నిమజ్జనం వరకు ప్రతి రోజూ కలుసుకుంటారు. ఇది ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. వినాయక చవితి వల్ల ఎంతో మంది ఆకలి తీరుతుంది. ఇలా సేవ చేసే మార్గం కూడా ఉంటుంది. వినాయకుడు అంటే విఘ్నాలను దూరం చేసేవాడు. ఇంకా సకల శుభాలనూ ప్రసాదించే దేవుడు. ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తిగా పర్యావరణ హితంగా జరగాలని అందరి ఆకాంక్ష.

Ganesh Chaturthi 2023 : గణేశ్‌ ఉత్సవాలకు ముస్తాబవుతోన్న తెలంగాణ.. ఈసారి మట్టి గణపయ్యను పూజిద్దామా..

Khairatabad Ganesh 2023 : శ్రీదశ మహావిద్యాగణపతిగా ఖైరతాబాద్ గణేశుడి దర్శనం.. మొదలైన భక్తుల కోలాహలం..

Last Updated : Sep 18, 2023, 5:51 AM IST

ABOUT THE AUTHOR

...view details