గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్‌తో మరణించిన గర్భిణీ కేసు షీట్‌ను సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు బహిర్గతం చేశారు. గర్భిణీ మృతిపై అవాస్తవాలు ప్రచారం చేయటం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆమె విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం జరగలేదన్నారు.
'గర్భిణి మృతిపై అవాస్తవాలు ప్రచారం చేయొద్దు' - గాంధీ ఆస్పత్రి తాజా వార్తలు
గాంధీ ఆస్పత్రిలో ఓ గర్బిణీ మృతిపై అవాస్తవాలు ప్రచారం చేయడం తగదని సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు అన్నారు. ఆమె కొవిడ్-19 పాజిటివ్ వచ్చి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతూ మరణించినట్టు వెల్లడించారు. ఆమెను కాపాడటానికి అనేక మంది డాక్టర్లు కృషి చేశారని తెలిపారు.
ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి కేసు రెఫర్ చేశారని, రాగానే ఐసీయూలో ఉంచి వైద్యం అందించినట్టు తెలిపారు. శ్వాస తీసుకోవటంలో ఆమె ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని విభాగాల డాక్టర్లు కృషి చేశారని వివరించారు. పరిస్థితి ఆమె భర్తతోపాటూ వారి కుటుంబసభ్యులకు తెలిపామని చెప్పారు. మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి 24 గంటలు పనిచేస్తున్నప్పటికీ.. ఇతర సమస్యలు ఉన్న కొవిడ్ రోగులు మరణిస్తున్నారని వెల్లడించారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు