మహాత్మా గాంధీ జీవితాశయం ఆదర్శనీయమని రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు అన్నారు. సత్యం, అహింస, శాంతి ఉత్తమ మార్గాలని నమ్మి ఆచరించిన గొప్ప మహనీయుడు మహాత్ముడని పేర్కొన్నారు. గాంధీ జయంతిని హైదరాబాద్లోని ట్రాన్స్‌పోర్ట్ భవన్లో ఘనంగా నిర్వహించారు.
సామాన్యుడిగా జీవితాన్ని ఆరంభించి మహాత్ముడిగా ఎదిగారు
మహాత్ముడి జీవితాశయం అందరికీ ఆదర్శనీయమని రవాణా శాఖ కమిషనర్ ఎం. ఆర్. ఎం రావు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా నగరంలోని ట్రాన్స్‌పోర్ట్ భవన్లో జాతిపిత చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు.
సామాన్యుడిగా జీవితాన్ని ఆరంభించి మహాత్ముడిగా ఎదిగారు
బాపూజీ చిత్రపటానికి కమిషనర్ పూలమాల వేసి నివాళులర్పించారు. సామాన్యుడిలా జీవితాన్ని ఆరంభించి మహాత్ముడిగా గాంధీ మారిన తీరు అమోఘమన్నారు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం ఆయన ఆయుధాలని కమిషనర్ శ్లాఘించారు.