సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో శ్రీనివాస్ అనే రోగి కరోనా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంగళవారం ఉదయం అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పారిశుద్ధ్య కార్మికులు గాంధీ ఆసుపత్రిలో విధులను బహిష్కరించి ధర్నా కొనసాగిస్తున్నందున.. చనిపోయిన కొవిడ్ రోగుల మృతదేహాల తరలింపు ప్రక్రియ కాస్త నెమ్మదించిందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.
'గాంధీలోని కొవిడ్ బాధితులు బయటికెళ్లారనే వార్తల్లో వాస్తవం లేదు' - గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ తాజా వార్తలు
గాంధీ ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కరించినందున కొవిడ్ రోగుల మృతదేహాల తరలింపు ప్రక్రియ నెమ్మదించిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు పేర్కొన్నారు. అందుకే శ్రీనివాస్ మృతదేహాన్ని తరలించడంలో కొంత ఆలస్యం జరిగిందన్నారు.
'గాంధీలోని కొవిడ్ బాధితులు బయటికెళ్లారనే వార్తల్లో వాస్తవం లేదు'
పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడం వల్ల శ్రీనివాస్ మృతదేహాన్ని తరలించడంలో కొంత ఆలస్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న కొంతమంది సిబ్బందితో అతని మృతదేహాన్ని చనిపోయిన రెండు గంటల లోపే అక్కడ నుంచి తరలించినట్లు తెలిపారు. శ్రీనివాస్ మృతదేహం నుంచి దుర్వాసన వస్తోందంటూ... కొవిడ్ రోగులు బయటికెళ్లిపోయారనే వార్తల్లో నిజం లేదని రాజారావు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:గాంధీలో కరోనా పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదు: హైకోర్టు
Last Updated : Jul 14, 2020, 10:16 PM IST