గాంధీ ఆస్పత్రిలో అత్యాచారం ఆరోపణలపై విచారణ కమిటీ నియమించామని సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. నిజనిజాలేంటో తెలియకుండా ఆరోపణలు చేయడం వల్ల ఆస్పత్రికి వచ్చే పేదలు భయాందోళన చెందుతారని రాజారావు అభిప్రాయపడ్డారు. గాంధీ ఆవరణలో 190 ప్లస్ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు.
నిన్న మధ్యాహ్నం మీడియా గ్రూప్ ద్వారా నాకు ఈ ఘటనపై సమాచారం అందింది. దానికి ముందు నాకు ఈ విషయం గురించి తెలియనే తెలియదు. కనీసం కంప్లైంట్ కూడా రాలేదు. వెంటనే చిలకలగూడా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఘటనపై ఫిర్యాదు చేశాము. అనంతరం ఆస్పత్రిలో విచారణ కమిటీ వేశాము. ఆరోపణలు నిజమైతే ఎవరినైనా క్షమించేది లేదు. కానీ గాంధీలో ప్రతి ఫ్లోర్లో పోలీసులు, భద్రతా సిబ్బంది ఉంటారు. 219 సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిలో వర్షాలు, కొన్ని టెక్నికల్ ప్రాబ్లం కారణంగా 25 పనిచేయట్లేదు. మిగిలినవన్నీ పనిచేస్తున్నాయి.
పోలీసులతో పాటు విచారాణ కమిటీ బాధితురాలిని సీసీ కెమెరాలో గుర్తించారు. అప్పుడు ఆమె పేషంట్ల వెయింటిగ్ హాల్లో వేచి చూస్తుంది. ఆమెను తీసుకెళ్లినట్లు ఎలాంటి దృశ్యాలు నమోదు కాలేదు. బాధితులు చేస్తున్న ఆరోపణలు జరిగినట్లు ఇప్పటివరకు ఈ విచారణలో తెలియలేదు. ఈ ఘటనపై పోలీసు స్టేషన్లోనే మొత్తం విచారణ జరుగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇప్పటివరకు ఇలాంటి పనులు చేయలేదు. ఇప్పటికి అది మాత్రమే చెప్పగలము. 24 గంటలు పోలీసులు రౌండ్స్ వేస్తారు. సెక్యూరిటీ ఉంటుంది. సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇంత భద్రత మధ్య ఆ ఆరోపణలు నిజమవ్వడానికి ఆస్కారమే లేదు. ప్రతి వార్డు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. పోలీసులు తిరుగుతూనే ఉంటారు. వాడని గదులకు లాక్ వేస్తాం కానీ... ఇలా సామూహిక అత్యాచారం చేయడానికి ఎక్కువ ఛాన్స్ లేదు.