సాధ్యమైనంతవరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెండ్ రాజారావు సూచించారు. ఎవరికి వాళ్లు సొంతంగా లాక్‌డౌన్ విధించుకోవాలన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే గాంధీలో మిగతా సేవలు నిలుపుదల చేశామని చెప్పారు.
'వైరస్ బాధితుల రాక ఇదే విధంగా కొనసాగితే కష్టమే' - కరోనా వ్యాప్తి
కరోనా వ్యాప్తిని ఆపడం ప్రజల చేతుల్లోనే ఉందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెండ్ రాజారావు అన్నారు. సాధ్యమైనంతవరకు ఇళ్లలో ఉండటమే సురక్షితమని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఆస్పత్రులకు వెళ్లకూడదని సూచించారు. ఆస్పత్రుల్లోనూ వైరస్ అంటుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
'వైరస్ బాధితుల రాక ఇదే విధంగా కొనసాగితే కష్టమే'
ప్రస్తుతం గాంధీలో ఐసీయూ సామర్థ్యం 350 పడకలే ఉన్నాయని తెలిపారు. నిన్న వచ్చిన కరోనా కేసులన్నీ ఐసీయూ అవసమైనవేనని... రాత్రంతా శ్రమించి పడకలు సర్దుబాటు చేశామని వెల్లడించారు. వైరస్ బాధితుల రాక ఇదే విధంగా కొనసాగితే కష్టమేనంటున్న గాంధీ ఆస్పత్రి సూపరింటెండెండ్ రాజారావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చూడండి:మరో 100రోజుల వరకు కరోనా ముప్పు: వైద్యులు